‘సందేహం లేదు.. కాంగ్రెస్‌దే అధికారం’ | Rahul writes letter to telangana congress incharge Khuntia | Sakshi
Sakshi News home page

సందేహం లేదు.. కాంగ్రెస్‌దే అధికారం: రాహుల్‌

Apr 7 2018 3:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

Rahul writes letter to telangana congress incharge Khuntia - Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన బస్సు యాత్రను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బస్సు యాత్ర అద్భుతంగా సాగుతోందని రాష్ట్ర నాయకులకు.. కార్యకర్తలకు రాహుల్‌ శుభాకంక్షాలు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అబద్దాలను.. కాంగ్రెస్ పార్టీ విలువలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement