పుష్కరాలపై నేడు కీలక భేటీ | Puskaralapai key meeting today | Sakshi
Sakshi News home page

పుష్కరాలపై నేడు కీలక భేటీ

Dec 6 2014 5:47 AM | Updated on Apr 7 2019 4:30 PM

వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను  రూపొందిస్తోంది. ప్రభుత్వ సలహా దారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో శనివారం సంబంధిత విభాగాలతో సమావేశమవుతున్నారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.  గోదావరికి చేరువలో ఉన్న దేవాలయాల వద్ద వసతుల కల్పనకు రూ.37 కోట్లు కావాలని దేవాదాయశాఖ అధికారులు కోరారు. సర్వ శ్రేయోనిధిలో ఇప్పటికే రూ.50 కోట్ల లోటు ఉన్నందున దాన్ని భర్తీ చేస్తే పుష్కరాల నాటికి ఆలయాల జీర్ణోద్ధరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement