పురపోరు... యువజోరు | Puraporu ... yuvajoru | Sakshi
Sakshi News home page

పురపోరు... యువజోరు

Mar 21 2014 4:42 AM | Updated on Oct 16 2018 6:33 PM

పురపోరు... యువజోరు - Sakshi

పురపోరు... యువజోరు

మునిసిపల్ పోరులో యువత జోరు కొనసాగుతోంది. ఈ సారి అన్ని పార్టీలు యువతనే ప్రధానంగా రంగంలోకి దించాయి.

 మునిసిపల్ పోరులో యువత జోరు కొనసాగుతోంది. ఈ సారి అన్ని పార్టీలు యువతనే ప్రధానంగా రంగంలోకి దించాయి. ఉన్నత చదువులు చదివిన యువతీయువకులు పురక్షేత్రంలో పోటీపడుతున్నారు. తమను గెలిస్తే వార్డులను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెబుతున్నారు. కుళ్లుపట్టిన రాజకీయాలను కడిగేస్తామని..మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామంటున్నారు. ఒక్కసారి గెలిపిస్తే యువసత్తా ఏమిటో చూపిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచి వారేం చేస్తారో వారి మాటల్లోనే..
 
 పేదలకు సేవచేయాలనే..
 

పేదలకు సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వ చ్చా..నేను పోటీచేస్తు న్న కాలనీలో ము రు గు కాలువల సమస్య ఎక్కువగా ఉంది. వీధిదీపాలు ఏర్పాటు చేస్తా. సీసీరోడ్లు వేయిస్తా..
 - తీగల గీత, (8వ వార్డు, నాగర్‌కర్నూల్)
 
  ప్రజల అభ్యున్నతికి పాటుపడతా
 

ప్రజలకు అందుబాటులో ఉండి, వారి స మస్యలు పరిష్కరించే లా ప్రయత్నం చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ, పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తా. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తా.  వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
 - వివేకానంద, కల్వకుర్తి
 
 నీటి ఎద్దడి నిర్మూలిస్తా

 శాతవాహన కాలనీలో నీటిఎ ద్దడి నిర్మూలనకు కృషిచేస్తా. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా. మునిసిపాలిటీలో యు వత కోసం అమలుచేస్తున్న స్వ యం ఉపాధి పథకాలు వారి అందేవిధంగా కృషిచేస్తాను. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గమనించి రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు అందుబాటులో ఉంటా..
  - రాఘవేందర్‌గౌడ్, (9వ వార్డు, నారాయణపేట)
 
 మోడల్‌వార్డుగా తీర్చిదిద్దుతా
 

దౌదర్‌పల్లి మునిసిపాలిటీలో వి లీనమైంది. సుమారు దశాబ్ద కా లం పాటు ఎక్కడిసమస్యలు అ క్కడే పేరుకుపోయాయి. మొ దటి సారిగా ఆ ప్రాంతానికి జరి గే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం బాధ్యతగా భావిస్తున్నాను. వీధిదీపాల ఏర్పాటుతో పాటు డ్రైనేజీ, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించి మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతా.                   - మధుప్రియ,
 బీటెక్, ఎంబీఏ (8వ వార్డు అభ్యర్థి, గద్వా
 
 మౌలిక సదుపాయాలు కల్పిస్తా  
 

ప్రస్తుతం వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. గెలిచిన వెం టనే తాగునీటి సమస్య పరి ష్కారం కోసం కృషిచేస్తాను. అలాగే మౌలికసదుపాయాల కల్పనతో పాటు డ్రైనేజీ, రోడ్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తా. వార్డును ఆదర్శవార్డుగా తీర్చదిద్దుతాను.
  - ప్రహార్ణి,
 బీటెక్(15వ వార్డు అభ్యర్థి గద్వాల)
 
 కాలం చెల్లిన విద్యుత్ వైర్లు తొలగిస్తా

 నా వార్డులో మౌలికసదుపాయాల కల్పనకు కృషిచేస్తా. నేను పోటీచేస్తున్న రెండోవార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యలను ప్రణాళికబద్ధంగా పరి ష్కరిస్తాను. డ్రైనేజీ కాల్వలతోపాటు అంతర్గతరోడ్లు వేయిస్తా. కాలం చెల్లిన విద్యుత్ వైర్లు, పరికరాలను తొలగించి..ప్రమాదాలను నివారిస్తాను.                - సువర్ణ, (2వవార్డు అయిజ)
 
 
 ప్రజారోగ్యంపై అవగాహన

 

విద్యానగర్ కాలనీలో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. స్థానికులు కంపువాసనను భరిం చలేకపోతున్నారు. నేను ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఈ సమస్యను మొ దటి ప్రాధాన్యమిస్తాను. నావార్డు ప్రజలకు ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తా.
  - కుడుముల శ్రావణి, (విద్యానగర్, కల్వకురి
 
 పాతగేరిని అభివృద్ధి చేస్తా..

 తాగునీటి సమస్య, మురుగునీటి సమస్య తీరుస్తాం. విద్యుత్‌దీ పాలు ఏర్పాటు చేస్తా. చిన్న, చిన్న రోడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటినంతా శుభ్రం చేయిస్తా. చెత్త కుండీలు ఏర్పాటు చేస్తా. పాత గేరిని అభివృద్ధి మరింత అభివృద్ధిచేసేందుకు కృషిచేస్తాను.              - హబీబుర్ రెహమాన్,  
 (5వవార్డు, నాగర్‌కర్నూల్)
 

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

 వార్డులో మెజార్టీ ప్ర జలు వివిధ కులవృత్తులు, చిరువ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతిఒక్కరికీ అందేవిధంగా చర్యలు తీసుకుంటాం. పేదలకు గృహ వసతి, ఇళ్లపట్టాలు, పింఛన్లు అందేవిధంగా చర్యలు తీసుకుంటాం.                   - లక్ష్మి, ఎంఎస్సీ,
 బీఈడీ (22వ వార్డు అభ్యర్థి గద్వాల)

Advertisement
 
Advertisement
Advertisement