ప్రియాంకకు పదవి.. టీపీసీసీ నేతల హర్షం | Priyanka Gandhis appointment as AICC general secretary | Sakshi
Sakshi News home page

ప్రియాంకకు పదవి.. టీపీసీసీ నేతల హర్షం

Jan 24 2019 3:26 AM | Updated on Jan 24 2019 3:26 AM

Priyanka Gandhis appointment as AICC general secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం కావడం పట్ల టీపీసీసీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డిల నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు బుధవారం గాంధీభవన్‌లో సంబురాలు జరిపాయి. బాణసంచా కాల్చి కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ప్రియాంక ఏఐసీసీ కార్యదర్శిగా నియామకం కావడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత ¿భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని వారంతా స్వాగతించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement