ప్రైవేటు పాఠశాలల ప్రచారం జోరందుకుంది. పాఠశాలల పున:ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు పల్లె, గల్లీబాటలు పట్టాయి.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : ప్రైవేటు పాఠశాలల ప్రచారం జోరందుకుంది. పాఠశాలల పున:ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతుండడంతో ప్రైవే టు యాజమాన్యాలు పల్లె, గల్లీబాటలు ప ట్టాయి. విద్యార్థులను వెతుక్కుని వారి ఇళ్ల వద్దే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ప్రభు త్వ పాఠశాలలకు సంబంధించి అధికారులు, ఉపాధ్యాయులు మాత్రం ఇంకా ని ద్రావస్థలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో ఇప్పటికే మూతబడుతున్న ప్రభుత్వ బడుల సంఖ్య యేడాదికేడాది పె రుగుతోంది. అయినా జిల్లా యంత్రాం గం ముందుగా మేల్కొనకపోవడంతో వి ద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు లాక్కెళ్లుతున్నాయి. బడులు తెరిచిన తరువాత బడిబాట కార్యక్రమాలెన్ని నిర్వహించినా ప్రయోజనం ఏమీ లేదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మూడు వేల పైచిలుకు ఉండగా, ప్రైవేటు పాఠశాలలు 836 ఉన్నాయి. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతలకు తోడు సర్కారు చదువులపై నమ్మకం సడలుతున్న పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు.
ఇదే సమయంలో పేద ప్రజలు సైతం తమ పిల్లలకు మంచి చదువు అందించాలన్న ఆరాటంలో వారు కూడా పిల్లలను కాన్వెంటులకు పంపడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ఏటా పాఠశాలల్లో వసతుల కల్పనకు మాత్రం కోట్లు మంజూరవుతున్నా వాటి వినియోగం విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిన జరుగుతున్నాయి. దీంతో అవి విద్యార్థులకు ఉపయోగ పడడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మూ త్రశాలలు, మరుగుదొడ్లు ఎన్నిసార్లు నిర్మించినా వాటికి నీటి వసతి కల్పించకపోవడం, వాటి నిర్వహణ గాలికి వదలేసిన పరిస్థితుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగమవుతున్నాయి.
కొన్ని పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించినా ఉపాధ్యాయుల కొరత ఉంటోంది. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులున్నా గదులు లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉ పాధ్యాయులను తీసుకుని ఇంటింటికీ వెళుతున్నాయి. ఇళ్ల వద్ద పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఇంటి వద్దనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టులు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు తీసుకెళుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను ప్రైవేటు బడులకు పంపాల్సి వస్తోంది.
కళాశాలలదీ అదే దారి....
ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులతో కలిసి విద్యార్థుల వద్దకు వెళ్లి తమ కళాశాలల్లో చేరమని కోరుతున్నాయి. కళాశాలల యాజమాన్యాలు ఇంటికి రావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని వాటిలో అడ్మిట్ చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని రకాల అర్హతలు ఉన్న అధ్యాపకులు ఉన్నా విద్యార్థులు మాత్రం ప్రైవేటు చదువులకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో యేడాదికేడాది విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ఇప్పటికైనా అధ్యాపకులు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


