ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య | private employee committed suicide with financial problems | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

Jul 2 2015 7:38 PM | Updated on Sep 2 2018 3:46 PM

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్(చాదర్‌ఘాట్): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కమల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కాలనీకి చెందిన కె. అమూల్‌కుమార్ (28) ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగి.

చాలీచాలనీ జీతంతో కుటుంబాన్ని పోషించడం అతడికి కష్టంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన కుమార్ వంటగదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement