వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి! | Pregnant Patient Died Due To doctors Negligence | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి!

Feb 28 2019 6:43 PM | Updated on Feb 28 2019 6:44 PM

Pregnant Patient Died Due To doctors Negligence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్యుల నిర్లక్ష్యంతోనే మూడు నెలల గర్భిణీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని చైతన్యపురిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. హీమోగ్లోబిన్‌ తక్కువగా ఉందని ఆస్పత్రి వైద్యులు చెప్పారని, అంతలోనే హడావిడిగా బయటకు పంపేశారని కుటుంబ సభ్యులు వాపోయారు. హాస్పిటల్‌ వైద్యులపై, నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే.. గతకొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీని కారణంగానే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్య పరంగా తమ నుంచి ఎలాంటి తప్పిదం లేదని, తాము నాణ్యమైన వైద్య చికిత్స అందించామని , కార్డియాక్ సమస్యతోటే హఠాన్మరణం పొందారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement