పీఆర్సీ నివేదిక సిద్ధం 

PRC Report Ready In Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) తన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదికను 12 రోజుల్లో సమర్పించాలన్న సీఎం ఆదేశాల మేరకు నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై ఓ నిర్ధారణకు వస్తూ కమిషన్‌ వర్గాలు నివేదికను సిద్ధం చేశాయి. ఈనెల 22 నాటికే సీఎం విధించిన గడువు పూర్తికావడంతో ఈ మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం నివేదికను రూపొందించారు.

అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నివేదిక సమర్పణకు పిలుపు రావాల్సి ఉందని, ఆ పిలుపు వచ్చిన వెంటనే నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న లేదా 27న పీఆర్సీ నివేదికను సీఎంకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top