పీఆర్‌సీకి లైన్ క్లియర్ | PRC dismisses Filipino leader's warnings | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీకి లైన్ క్లియర్

Apr 16 2015 3:12 AM | Updated on Sep 3 2017 12:20 AM

ఉద్యోగుల వేతన స్థిరీకరణకు అవసరమైన ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కేళ్ల జీవోను..

అడ్వాన్సుమెంట్ స్కేళ్ల జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన స్థిరీకరణకు అవసరమైన ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కేళ్ల జీవోను రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం జారీ చేసింది. తొమ్మిదో పీఆర్‌సీ అమ లు చేసిన సిఫారసులను యథాతథంగా పదో పీఆర్‌సీలోనూ వర్తింపజేసింది. గతంలో ఉన్న మార్గదర్శకాలనే ఇందులో పొందుపరిచింది.కాగా 2013 జులై ఒకటో తేదీ నుంచే ఈ ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కేళ్లు వర్తింపజేయడం విశేషం.నగదు ప్రయోజనాన్ని సైతం 2014 జూన్ రెండో తేదీ నుంచి చెల్లించనుండటం గమనార్హం.

కాగా ఉద్యోగ,  ఉపాధ్యాయ సంఘాలిచ్చిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోకపోవటం ఉద్యోగులను నిరాశకు గురి చేసింది. ప్రతీ అయిదేళ్లకోసారి 25 ఏళ్ల వరకు యాంత్రిక పదోన్నతుల స్కేళ్లు ఇవ్వాలని సంఘాలు  విజ్ఞప్తి చే శాయి. ఈసారీ ఆరేళ్లకోసారి ఇచ్చే విధానాన్నే ప్రభుత్వం కొనసాగిం చింది. కింది కేడర్‌లో 24 ఏళ్ల యాంత్రిక పదోన్నతుల స్కేలు పొందిన తర్వాత రెగ్యులర్ ప్రమోషన్ పొందితే ఆ ఉద్యోగికి మళ్లీ యాం త్రిక పదోన్నతుల స్కేళ్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీన్నీ  పరిగణనలోకి తీసుకోలేదు. రెగ్యులర్ ప్రమోషన్ వస్తే.. ఎఫ్‌ఆర్ 22(బీ) 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరితే.. ఒకే ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. బకాయిల చెల్లింపుపై మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.  
 
కారుకు రూ.6 లక్షల అడ్వాన్స్
ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే రుణాలపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కారు కొనుగోలుకు రూ.6 లక్షలు లేదా మూల వేతనంపై 15 రెట్లు... ఏదీ తక్కువైతే అది రుణంగా అంది స్తుంది. మోటార్ సైకిల్‌కు రూ.80 వేలు, మోపెడ్‌కు రూ.35 వేలు, సైకిల్‌కు రూ.10 వేలు అడ్వాన్సుగా తీసుకోవచ్చు. ఉద్యోగులు తమ కుమార్తె లేదా కుమారుడి పెళ్లిళ్లకు రూ. 75 వేల నుంచి రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.  కంప్యూటర్‌కు రూ.50 వేలు, పండుగ అడ్వాన్సులకు రూ.5 వేల నుంచి రూ.7,500, ఎడ్యుకేషన్ అడ్వాన్సుగా ఏడాదిలో ఒకసారి 7,500 రుణం తీసుకోవచ్చు. కాగా పండుగ అడ్వాన్సుపై ప్రభుత్వ జీవోలో తప్పు దొర్లింది. ఇది  ఉద్యోగులను అయోమయానికి గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement