‘మావో’ల సామగ్రి స్వాధీనం | possession of maoist equipment | Sakshi
Sakshi News home page

‘మావో’ల సామగ్రి స్వాధీనం

Sep 21 2014 2:51 AM | Updated on Oct 9 2018 7:52 PM

‘మావో’ల సామగ్రి స్వాధీనం - Sakshi

‘మావో’ల సామగ్రి స్వాధీనం

తిర్యాణి మండలం పంగిడి మాదర అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో..

బెల్లంపల్లి : తిర్యాణి మండలం పంగిడి మాదర అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు చెందిన సామగ్రి లభించినట్లు ఎస్పీ గజ రావుభూపాల్ తెలిపారు. శనివారం రాత్రి స్థాని క డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన పంగిడిమాదర అడవుల్లో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 12 మంది మావోయిస్టులు అలీవ్‌గ్రీవ్ దుస్తుల్లో ఆయుధాలతో కనిపించారు.

సాయుధులైన మావోయిస్టులను లొంగిపోవాల ని హెచ్చరికలు చేయగా పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు చేయగా మావోయిస్టులు పారిపోయా రు. అనంతరం ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా మావోయిస్టులకు చెందిన కిట్‌బ్యాగులు, మెడికల్ కిట్, విప్లవ సాహిత్యం, హవర్‌సాక్స్, వంట పాత్రలు, గొడుగులు లభించినట్లు వివరించా రు. జిల్లాలో పట్టు సాధించడానికి మావోయిస్టు జిల్లా కమిటీ కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ క్రాంతి, ఏరియా కమిటీ కార్యదర్శి ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్, జిల్లా కమిటీ సభ్యుడు మైలారపు అడేల్లు అలి యాస్ భాస్కర్, ఇద్దరు మహిళా మావోయిస్టులు, మరో తొమ్మిది మంది సభ్యులు సంచరిస్తున్నారన్నారు.

 ఖాళీ చేయిస్తాం
 మావోయిస్టులను జిల్లా నుంచి ఖాళీ చేయిస్తామని ఎస్పీ గజరావు భూపాల్ స్పష్టం చేశారు. జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత పరి స్థితుల్లో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడమో లేక జిల్లా నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడ మో చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.ఈశ్వర్‌రావు, సీఐ బాలాజీ, టూటౌన్ ఎస్‌హెచ్‌ఓ మహేశ్‌బాబు, తిర్యాణి ఎస్సై మో హన్, దేవాపూర్ ఎస్సై కె.స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement