కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల | ponnla lakshmaih fire on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల

Oct 18 2014 12:22 AM | Updated on Jun 4 2019 5:04 PM

కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల - Sakshi

కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల

‘‘పండుగ చేసుకోవాల్సిన కొత్త రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయి.

‘‘పండుగ చేసుకోవాల్సిన కొత్త రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయి. నాలుగు నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కనికరం లేని ప్రభుత్వమిది. రైతు, పేదల వ్యతిరేకి కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తుండు. రుణ మాఫీ సహా ఏది అడిగినా వాయిదాలతోనే సరిపెడుతుండు. చివరకు అసెంబ్లీ సమావేశాలను, సొంత పార్టీ ప్లీనరీలను కూడా వాయిదాలపై వాయిదా వేస్తున్నాడంటే కేసీఆర్‌ది ‘వాయిదాల పాలన’ కాక మరేంది? కరెంట్ అడిగిన పాపానికి రైతులను గొడ్డును బాదినట్లు బాదిన చరిత్ర ఆనాడు చంద్రబాబుదైతే.. ఈనాడు కేసీఆర్‌దే. విద్యుత్ ఇవ్వడం చేతగాని కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడమెందుకు? బిడ్డా కేసీఆర్.. ఇక నీ ఆటలు సాగనీయం. ఏడు గంటల విద్యుత్, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది.’’
 

Advertisement
 
Advertisement
Advertisement