బీసీ సంఘాల నేతలది ఆర్థిక రాజకీయం | The politics of the BC leaders are economic politics | Sakshi
Sakshi News home page

బీసీ సంఘాల నేతలది ఆర్థిక రాజకీయం’

Jan 9 2019 3:35 AM | Updated on Jan 9 2019 3:35 AM

సాక్షి, హైదరాబాద్‌: కొందరు బీసీ సంఘాల నేతలు ఆర్థిక రాజకీయం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి కిషన్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌ నేత చిక్కాల రామారావుతో కలిసి తెలంగాణ భవ న్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘బీసీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ను తప్పుపడుతూ కొన్ని పార్టీలు, బీసీ సంఘాల నేతలు మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. కొందరు బీసీ సంఘాల నేతల ముసుగులో ఆర్థిక రాజకీయం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వానికి బీసీలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్‌ఎస్‌ 88 సీట్లు గెలిచేందుకు తోడ్పడ్డారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న నాయకుల వెంట బీసీలు లేరు. బీసీల కోసం ఏ సీఎం ప్రవేశపెట్టని పథకాలు కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. బీసీలకు రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి గౌరవించారు. అందుకే బీసీలు ఓట్లతో ఆశీర్వదించారు’అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement