మంత్రి ఎర్రబెల్లి కారు తనిఖీ | Police Check Minister Errabelli Dayakar Rao Vehicle In Thorrur | Sakshi
Sakshi News home page

మంత్రి ఎర్రబెల్లి కారు తనిఖీ

Jan 12 2020 8:14 AM | Updated on Jan 12 2020 8:14 AM

Police Check Minister Errabelli Dayakar Rao Vehicle In Thorrur - Sakshi

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని తనిఖీ చేస్తున్న బృందం   

తొర్రూరు నుంచి కొడకండ్ల వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారును ఆపి తనిఖీ చేశారు.

సాక్షి, తొర్రూరు: మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. తొర్రూరు నుంచి కొడకండ్ల వైపు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారును ఆపి తనిఖీ చేశారు. సిబ్బంది వాహనం వద్దకు చేరుకున్నాక మంత్రిని గుర్తించి వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు. అయితే.. వాహనాన్ని తనిఖీ చేయాలని మంత్రి సూచించడంతో పరిశీలించారు. మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతం గా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement