మహిళా అభ్యర్థులను వదల్లేదు.. దాడులు చేసి చీర లాగారు! | TDP Rowdies Attack On YSRCP Leaders In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మహిళా అభ్యర్థులను వదల్లేదు.. దాడులు చేసి చీర లాగారు!

Oct 22 2026 11:35 AM | Updated on Oct 22 2026 11:36 AM

TDP Rowdies Attack On YSRCP Leaders In Andhra Pradesh

నామినేషన్లు చించేసి కొట్టారని కన్నీటి పర్యంతమవుతున్న అభ్యర్థి (ఫైల్‌)

మార్కాపురం: మున్సిపల్‌ ఎన్నికల్లో కనిగిరిలో పచ్చమూకలు చెలరేగిపోయాయి. నామినేషన్ల ఘట్టం చివరి రోజున.. వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ అభ్యర్థులకు చెందిన సుమారు 8 మంది నామినేషన్‌ పత్రాలను కూటమి గూండాలు బరిలోకి దిగి పచ్చ చొక్కా పోలీసుల సహకారంతో దాడులు చేసి పత్రాలను చేతుల్లో నుంచి లాక్కుని మరీ చించేశారు. మహిళా అభ్యర్థులను సైతం వదలకుండా దాడి చేశారు. తన చీరకూడా లాగారంటూ ఓ మహిళా అభ్యర్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 

18వ వార్డు అభ్యర్థి ఎస్‌కే సమీరాకు చెందిన నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. నామినేషన్‌ కేంద్రంలోనే సుమారు 200 మంది బైఠాయించి టీడీపీ మహిళా నాయకులు 10 మంది చేత పత్రాలు లాగించేయడం, గట్టిగా నిలబడి, మాట్లాడితే భౌతిక దాడులు చేశారు. 18వ వార్డు అభ్యర్థి ఎస్‌కే సమీరాను, ప్రపొజల్‌కు వెళ్లిన అతని భర్త ఫరూక్‌ను కొట్టి నామినేషన్‌ కేంద్రం నుంచి లాగి బయటకు గెంటారు. ఈ తంతు అంతా పోలీసుల సమక్షంలో జరిగినా కనీసం స్పందించకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. అలాగే 3వ వార్డు చెందిన అభ్యర్థి ఎం.మధు నామినేషన్‌ పత్రాలు లాక్కుని, నెట్టారు. ఈ క్రమంలో మధు చేతికి గాయమైంది. దీనిపై పోలీసులకు చెప్పినా కనీస స్పందన చూపలేదు.

పదో వార్డుకు చెందిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పత్రాన్ని లాక్కుని స్వతంత్ర అభ్యర్థిపై దాడికి దిగారు. చివరి రోజు వైఎస్సార్‌ సీపీకి చెందిన సుమారు 8 మంది నామినేషన్‌ పత్రాలను టీడీపీ గూండాలు లాక్కుని చించేశారు. వేరొక పార్టీ చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు పచ్చమూకలు లాక్కుని బయటకు నెట్టారు. మహిళ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారు. ఇలా టీడీపీ గూండాలు పోలీసుల సహకారంతో రెచ్చిపోయి..దమనకాండ సాగించారు. వైఎస్సార్‌ సీపీతో పాటు ఇతరపార్టీల, స్వతంత్య్ర అభ్యర్థుల నామినేషన్ల లాగి చించేసి హల్‌చల్‌ చేశారు.

ఇదీ చదవండి: ఎన్నికల కోడ్‌తో పనేంటి!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement