కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫార్మసీ కోర్సు చదువుతున్న కవిత అనే విద్యార్థినిని ఫీజు కట్టాలంటూ యాజమాన్యం గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు తెలిసింది.
తాజాగా ఆమెకు హాల్ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కవిత.. ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఇక్కడ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది.