గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | person died in road accident | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Feb 12 2015 11:02 PM | Updated on Sep 2 2017 9:12 PM

ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బూర్గమ్ గ్రామంలో గురువారం జరిగింది.

రెంజల్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బూర్గమ్ గ్రామంలో గురువారం జరిగింది. పాడ్దె సంతోష్(44) అనే వ్యక్తి గురువారం సాయంత్రం బూర్గమ్ గ్రామ శివారు నుంచి నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement