పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Person attempted to commit suicide in police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Sep 29 2015 4:47 AM | Updated on Nov 6 2018 7:56 PM

పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Sakshi

పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీస్‌స్టేషన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓవ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తిరుమలాయపాలెంలో సోమవారం చోటుచేసుకుంది...

- హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
- తల్లిదండ్రుల మరణంతో అనాథగా చిన్నారి
గోల్‌తండా (తిరుమలాయపాలెం) :
పోలీస్‌స్టేషన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓవ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తిరుమలాయపాలెంలో సోమవారం చోటుచేసుకుంది.  వివరాలిలా ఉన్నారుు. మండలంలోని గోల్‌తండాకు చెందిన గుగులోత్ సురేశ్ (25).. తన భార్య స్వరూప(20) హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 18న తిరుమలాయపాలెంలోని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయూడు. ఇదే కేసులో సురేశ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లొంగిపోయిన సురేశ్‌ను ఓ గదిలో ఉంచడంతో అక్కడే ఓ తాడు చూసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి సురేశ్ పెట్టుకున్న ఉరిని తొలగించారు.

అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ సురేశ్ సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండడంతో మెరుగైన చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. భార్య మరణించిన కొద్దిరోజుల్లోనే భర్త కూడా మృతిచెండటంతో వారి ఏడాది వయసున్న పాట ధనలక్ష్మి అనాథగా మారింది. స్వరూపకు వివాహం కాని ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారే ఆ పాపను చూసుకుంటున్నారు. కాగా పోలీస్‌స్టేషన్‌లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement