మంకీ గార్డులుగా మారిన ట్రీ గార్డులు! | People Using Tree Guards for Different Purposes | Sakshi
Sakshi News home page

మంకీ గార్డులుగా మారిన ట్రీ గార్డులు!

Sep 20 2019 9:07 AM | Updated on Sep 20 2019 9:07 AM

People Using Tree Guards for Different Purposes - Sakshi

ఇందల్‌వాయి: హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని పశువులు మేయకుండా టోల్‌ప్లాజా అధికారులు, అటవీశాఖ అధికారులు రహదారుల వెంబడి ట్రీగార్డులు ఏర్పాటు చేస్తే ప్రజలు వాటిని తీసుకెళ్లి ఇంటివద్ద మంకీ గార్డులుగా వాడుకుంటున్నారు. జాతీయ రహదారిపై గన్నారం వద్ద ఉన్న ఓ దాబా నిర్వాహకులు ట్రీ గార్డులను దాబా వద్ద కోతులు రాకుండా పెట్టడమే ఇందుకు నిదర్శనం. పశువులకు అందకుండా పెరిగిన చెట్ల నుంచి ట్రీ గార్డులను తొలగించి కొత్తగా నాటిన మొక్కలకు వినియోగించడంలో అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చాలా మొక్కలకు రక్షణ లేక హరితహారం లక్ష్యం నీరుగారిపోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement