కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ దొరికాడు | Nizamabad Constable Pramod Case Suspect Riaz dies | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ దొరికాడు

Oct 19 2025 4:41 PM | Updated on Oct 19 2025 6:18 PM

Nizamabad Constable Pramod Case Suspect Riaz dies

సాక్షి.హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య కేసు నిందితుడు దొరికినట్లు నిజామాబాద్‌ సీపీ చైతన్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. 

అందులో..‘నిజామాబాద్‌ టౌన్‌ 6 పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని సారంగపూర్‌ ప్రాంతంలో ఆసిఫ్‌ అనే వ్యక్తిపై రియాజ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్‌,రియాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్‌ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement