లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి | one man killed in lorry,bike accident in adilabad district | Sakshi
Sakshi News home page

లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి

Jan 24 2015 5:31 PM | Updated on Sep 2 2017 8:12 PM

లారీ-బైకు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

లారీ-బైకు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. లక్సెట్టిపేట జాతీయ రహదారిపై లక్ష్మీపూర్ స్టేజి వద్ద సిమెంట్ లారీ, బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న బెక్కమ్ రవి(23) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. బాలరావుపేటకు చెందిన రవి బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని లక్సెట్టిపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు చేరడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement