రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నం, గాయాలు | one injured by electric shock in bb nagar railway station | Sakshi
Sakshi News home page

రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నం, గాయాలు

Jan 3 2015 1:17 PM | Updated on Sep 5 2018 2:26 PM

నల్లగొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా గాయపడ్డాడు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరుకు చెందిన రవి అనే యువకుడు శనివారం డెల్టా ప్యాసింజర్ రైలు బోగీ ఎక్కి ఫోటో దిగేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పైనున్న కరెంట్ తీగలు తగలటంతో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement