బైక్, కారు ఢీకొని యువకుడి మృతి | one died in bike and car collisioed incident | Sakshi
Sakshi News home page

బైక్, కారు ఢీకొని యువకుడి మృతి

Jun 5 2016 4:48 PM | Updated on Sep 18 2019 3:24 PM

బైక్ పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారును ఢీకొట్టారు.

నేరేడుచర్ల(నల్లగొండ): బైక్ పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారును ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం చోటుచేసుకుంది.

స్థానిక ఎన్టీఆర్ నగర్‌కు చెందిన షేక్ గౌస్(17), నాగరాజు(24) బైక్‌పై వెళ్తుండగా.. హుజూర్‌నగర్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో దాని వెనుక వస్తున్న కారును ఢీకొట్టారు. ఆ సమయంలో బైక్ చాలా వేగంలో ఉంది. దీంతో  బైక్ నడుపుతున్న గౌస్ అక్కడికక్కడే మృతిచెందగా, నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement