కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మరణం | one died due to Adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మరణం

Nov 22 2015 4:13 PM | Updated on Mar 28 2018 11:11 AM

హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు లభించకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.

రంగారెడ్డి జిల్లా:  హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు లభించకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

కర్ణాటకకు చెందిన చిలకల సురేష్(35) గత ఐదేళ్లుగా చిలక జోస్యం చెప్పుకుంటూ ధారూర్‌లోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో కల్తీ కల్లుకు బానిసయ్యాడు. కొంతకాలంగా కల్తీకల్లు దొరక్కపోవడంతో..తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్  మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement