బస్సు, స్కూటీ ఢీ: ఒకరి మృతి | One dead and One injured in Road accident | Sakshi
Sakshi News home page

బస్సు, స్కూటీ ఢీ: ఒకరి మృతి

Dec 15 2015 8:03 PM | Updated on Aug 30 2018 3:56 PM

నగరంలోని ఉప్పల్ నల్లచెరువు వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్ నల్లచెరువు వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement