హోంగార్డ్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్ల ఉద్యోగాలకు ప్రకటన | notification for the posts of driver | Sakshi
Sakshi News home page

హోంగార్డ్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్ల ఉద్యోగాలకు ప్రకటన

Mar 9 2015 7:23 PM | Updated on Sep 29 2018 5:29 PM

హైదరాబాద్ లోని సైబరాబాద్ హోంగార్డ్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్ల ఉద్యోగాలకు దరఖాస్తు ప్రకటన వెలువడింది.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని సైబరాబాద్ హోంగార్డ్ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్ల ఉద్యోగాలకు దరఖాస్తు ప్రకటన వెలువడింది. అర్హులైన పురుష అభ్యర్థులు ఈ నెల10 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు) గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు ఉండవలసిన అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 28-02-2015 నాటికి 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారై ఉండాలి. 160 సెంటీమీటర్ల ఎత్తు, రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. అర్హతలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలతో పాటు ఒక్కోటీ రెండు కాపీల జిరాక్స్‌లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ పేరుతో ప్రకటన జారీ అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement