కోటి మంది చంద్రబాబులు వచ్చినా... | nobody can stop palamuru project, says kcr | Sakshi
Sakshi News home page

కోటి మంది చంద్రబాబులు వచ్చినా...

Jun 11 2015 7:53 PM | Updated on Mar 22 2019 2:59 PM

కోటి మంది చంద్రబాబులు వచ్చినా... - Sakshi

కోటి మంది చంద్రబాబులు వచ్చినా...

హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా... కోటి మంది చంద్రబాబులు వచ్చినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

భూత్పూర్‌: హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా... కోటి మంది చంద్రబాబులు వచ్చినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మీ కళ్లముందే ప్రాజెక్టు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.

పాలమూరు ప్రాజెక్టుకు అనుమతుల్లేవని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనడం అర్థరహిమని కొట్టిపారేశారు. ఏ అనుమతులతో పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు మొదలెట్టారని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలకు కురుమూర్తి ప్రాజెక్టుగా నామకరణం చేసినట్టు కేసీఆర్ ప్రకటించారు. నాలుగేళ్లలో దీన్ని పూర్తిచేస్తామని, ముంపు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హమీయిచ్చారు. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే పరిహారం ఇస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement