అసలేం జరుగుతోంది?

Nizamabad Collector Ram Mohan Rao Review Meeting - Sakshi

ఇప్పటివరకు 19 శాతం మాత్రమే రుణాలిచ్చారా..?

స్త్రీనిధి రుణాల మంజూరుపై కలెక్టర్‌ అసహనం

సాక్షి, ఇందూరు (నిజామాబాద్‌): జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ తీరుపై కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరాల్లో స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో ముందున్న జిల్లా... కొన్ని నెలులుగా ఎందుకు ఒక్కసారిగా వెనుకబడి పోయిందని ఆరా తీశారు. రుణాల ప్రగతి ఇంతగా పడిపోవడానికి గల కారణాలేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో స్త్రీనిధి రుణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.207 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ.135 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 19 శాతంతో రూ.39 కోట్లు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకుల అశ్రద్ద ఉంటే వాటి వివరాలు తెలుపాలని, వారానికోసారి సమీక్షించుకుని సమస్య ఎక్కడుందో దృష్టి పెట్టి రుణాల పురోగతిని సాధించేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. వచ్చే జనవరిలో అభివృద్ధి కనిపించాలని, నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాల లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలన్నారు. మంజూరు చేసిన రుణాలకు రికరీకి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. డీఆర్‌డీవో రమేశ్‌ రాథోడ్, మెప్మా పీడీ రాములు, స్త్రీనిధి ఆర్‌ఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top