రాజ్యాంగ పరిరక్షణకు దేశ  వ్యాప్తంగా సభలు: జాజుల  | Nations around the country for the preservation of the Constitution | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణకు దేశ  వ్యాప్తంగా సభలు: జాజుల 

Jan 12 2019 4:27 AM | Updated on Jan 12 2019 4:27 AM

Nations around the country for the preservation of the Constitution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12న నల్లగొండ, 13న విజయవాడ, 22న ఢిల్లీ, 27న ఒరిస్సాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ 48 గంటల్లో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. జనా భాలో సగానికి పైగా ఉన్న బీసీలను పట్టించుకోకుండా కేవలం ఓట్ల లబ్ధి కోసం బీజేపీ ప్రభు త్వం కుట్ర చేసిందన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సభలకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement