నా జీతం మొత్తం పార్టీకే ఇస్తా | My restaurent life salary total party -vamsichand reddy | Sakshi
Sakshi News home page

నా జీతం మొత్తం పార్టీకే ఇస్తా

May 29 2014 2:05 AM | Updated on Mar 18 2019 9:02 PM

నా జీతం మొత్తం పార్టీకే ఇస్తా - Sakshi

నా జీతం మొత్తం పార్టీకే ఇస్తా

రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తనకు ఎమ్మెల్యే పదవి ద్వారా వచ్చే జీతాన్ని పార్టీకి విరాళంగా ప్రకటించారు.

రాహుల్‌గాంధీతో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి

 న్యూఢిల్లీ: రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తనకు ఎమ్మెల్యే పదవి ద్వారా వచ్చే జీతాన్ని పార్టీకి విరాళంగా ప్రకటించారు. తనను ఎమ్మెల్యేను చేసిన పార్టీ అభివృద్ధికోసం ఇకపై అవిశ్రాంతంగా కృషిచేస్తానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలిపారు.

బుధవారం వంశీచంద్‌రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీ ని ఆయన నివాసంలో కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల సేపు రాహుల్‌గాంధీతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే కావడానికి అవకాశమిచ్చినందుకు ఆయన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement