నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పెసరకు రికార్డు ధర పలికింది.
తిరుమలగిరి (నల్లగొండ): నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పెసరకు రికార్డు ధర పలికింది. క్వింటాల్‌కు రూ.7,669 ధర వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. సాధారణంగా రూ.5,000- రూ.7,000 పలికే ధర వారం రోజుల్లోనే వెయ్యికి పెరిగింది. సోమవారం మరింత ఎగబాకి రూ.7,669 గా నమోదైంది.
మార్కెట్‌కు 2,500 క్వింటాళ్ల పెసలు వచ్చాయి. అయితే, రికార్డు ధర పలకటంతో రైతులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవటంతో దిగుబడి తగ్గిందని, లేకుంటే మరింతగా దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తేవని అధికారులు అంటున్నారు.


