నగరంలోని జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అల్విన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అల్విన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీలోని నివాసముండే ప్రసన్న(35), మహేశ్వరి(21)లు తల్లీ, కూతుళ్లు. వీరు శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలయరాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి దర్యాప్తు చేస్తున్నారు.