తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం | mother and daughter gang-raped in medak district | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం

Oct 4 2014 10:01 AM | Updated on Aug 25 2018 4:51 PM

తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం - Sakshi

తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం

మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తల్లీకూతురుపై అత్యాచారం...

(సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు)

మెదక్ :  మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తల్లీకూతురుపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే రామక్కపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని దసరా వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి ఆమెను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం దుండగులు...విద్యార్థిని ఇంటికి వెళ్లి మీ కూతురు అక్కడ పడిపోయిదని ఆమె తల్లికి సమాచారం అందించారు. దాంతో కంగారు పడిన ఆమె వారి వెంట వెళ్లగా...తల్లిపై కూడా దుండగులు అత్యాచారం చేశారు. అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బాధితురాలు శనివారం ఉదయం గ్రామ సర్పంచ్కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement