ఆ విషయంలో కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారు

Minister Errabelli Dayakar Rao Attends To Consumer Forum Meeting In Hanmakonda - Sakshi

సాక్షి, హన్మకొండ : కల్తీ వస్తువుల విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చాలా సీరియస్‌గా ఉన్నారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆరు జిల్లాల సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వినియోగదారులకు హక్కులు చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అయిపోతోంది. పాలు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. కల్తీ లేని వస్తువులతోనే ఆరోగ్యం. ఆరోగ్యంతోనే సమాజం బాగుంటుంది. కల్తీ వస్తువులతో అందరూ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టపోతారు.  వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోసం పని చేయాలి. అందరికీ కల్తీ లేని వస్తువులు అందేలా చూడాల’’ని అన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top