ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు | milad un nabi celebrations in hyderabad | Sakshi
Sakshi News home page

ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

Dec 24 2015 7:46 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో ముస్లింలు గురువారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చార్మినార్: హైదరాబాద్లో ముస్లింలు గురువారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజును మిలాద్ ఉన్ నబీగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జంటనగరాల్లో సందడి వాతావరణం కనిపించింది. పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలతో పాటు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement