కరోనా.. 'నడక'యాతన!

Migrant Workers Walking to Village From Sangareddy Lockdown - Sakshi

హైదరాబాద్‌ టు నారాయణఖేడ్‌ మూటా ముల్లెతో వలస కూలీల ఇంటిబాట ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి చిన్నారులు సైతం..సంగారెడ్డిలో ఆహారం అందించిన పోలీసులుప్రత్యేక వాహనంలో తరలింపు

ఎర్రటి ఎండ.. నిర్మానుష్యమైన రోడ్డు.. చిన్నారులు మాస్కులు ధరించి బుడిబుడి అడుగులు వేస్తుండగా.. వెనకాల మూటా ముల్లె్ల నెత్తిన పెట్టుకొని అమ్మానాన్నలను అనుకరిస్తున్నారు. ఆకలి.. దప్పికతో అలమటిస్తూ.. అడుగు తీసి అడుగు వేయలేని దయనీయ పరిస్థితి వారిది. గమ్యం చేరడమే లక్ష్యంగా.. వందల కిలో మీటర్ల మేర నడుస్తూ నరకయాతన అనుభవించారు. ఇది కరోనా వైరస్‌ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న పాట్లు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పని చేయనిదే పూట గడవని వారికి శరాఘాతంగా మారింది. దీంతో వారంతా ఇంటి బాట పడుతున్నారు. పిల్లాపాపలతో బయలుదేరుతున్నారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వందల కిలో మీటర్ల మేర కాలినడన బయలుదేరుతున్నారు.

ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి హైదరాబాద్‌ నుంచి కాలినడన వెళుతున్న నారాయణఖేడ్‌ చిన్నారులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, బిచ్కుంద, పెద్దశంకరంపేట, కంగ్టికి చెందిన వలస కూలీలు హైదరాబాద్‌ కూకట్‌పల్లి, మియాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించడం.. మూడు రోజులుగా పనులు లేకపోవటంతో తమ సొంత ఊర్లకు కాలినడకన బయలుదేరారు. 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలకు ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టిన నడక.. మధ్యాహ్నం వరకు సంగారెడ్డికి చేరుకుంది. రోడ్డుపై చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించి భారమైన అడుగులు వేస్తూ నడవడం చూపరులను కలచివేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌ రెడ్డి, టౌన్‌ సీఐ వెంకటేశం, రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ వారికి ఆహారం అందించారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సురక్షితంగా వారి ఊర్లకు పంపించారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో ఆదుకున్న పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.  – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

లాక్‌డౌన్‌తో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామస్తులు హరిద్వార్‌లో చిక్కుకున్నారు. తమను కాపాడాలని బాధిత కుటుంబీకులు బుధవారం చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో, కలెక్టర్‌కు తమ సమస్యను విన్నవించారు. ఇక్కడికి చెందిన 12 మంది ఈ నెల 15న రైలులో తీర్థయాత్రలకు వెళ్లారు. వారు ఈ నెల 22న హరిద్వార్‌ నుంచి కాశీకి వెళ్లాల్సి ఉండగా  జనతాకర్ఫ్యూతో అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రవాణా  స్తంభించిపోయింది. ప్రస్తుతం హరిద్వార్‌ గాంధీ హరిజన ఆశ్రమంలో ఉన్నట్లుగా వారు తెలిపారు. –చిలుకూరు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-04-2020
Apr 06, 2020, 03:50 IST
నేరడిగొండ: ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మథుర కాలనీవాసులు ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రాల బాట...
06-04-2020
Apr 06, 2020, 02:35 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విరుచుకుపడుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి...
06-04-2020
Apr 06, 2020, 02:12 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం మళ్లీ 62 పాజిటివ్‌...
05-04-2020
Apr 05, 2020, 21:13 IST
ఢిల్లీ : కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు...
05-04-2020
Apr 05, 2020, 19:41 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత మరో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో...
05-04-2020
Apr 05, 2020, 18:39 IST
ఇస్లామాబాద్‌: దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి వినాశనం సృష్టిస్తుంటే మరోవైపు ప్రజలు నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తుండటం పట్ల పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌...
05-04-2020
Apr 05, 2020, 16:35 IST
లండన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే కొన్నిచోట్ల ప్రజలు లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా...
05-04-2020
Apr 05, 2020, 16:17 IST
న్యూ ఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌త‌ప‌ర‌మైన ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి దేశ ప్ర‌జ‌ల ఆగ్ర‌హావేశాల‌కు గురైన‌ త‌బ్లిగి జ‌మాత్ అధ్య‌క్షుడు మౌలానా...
05-04-2020
Apr 05, 2020, 15:23 IST
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్‌...
05-04-2020
Apr 05, 2020, 15:09 IST
ఇండోర్‌: ఆసుప‌త్రిలో ఐసీయూ గ‌ది తాళం చెవి దొర‌క్క‌పోవ‌డంతో స‌కాలంలో చికిత్స అంద‌క ఓ మ‌హిళ క‌న్నుమూసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో...
05-04-2020
Apr 05, 2020, 14:49 IST
సాక్షి, తిరుపతి : కరోనా నేపథ్యంలో భారతీయులలో ఐక్యతా భావాన్ని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ లైట్‌ దియా’కు...
05-04-2020
Apr 05, 2020, 14:42 IST
ప్రతి ఇంటిలో కిచెన్‌ ఒక ల్యాబ్‌ వంటిదని,  తల్లిదండ్రులు పిల్లలను వంట తయారు చేయడంలో భాగం చేయాలని అన్నారు.
05-04-2020
Apr 05, 2020, 13:42 IST
న్యూఢిల్లీ: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, క్రీడాకారులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలకు పెద్ద...
05-04-2020
Apr 05, 2020, 13:30 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా (కోవిడ్‌).. కరోనా.. ఇప్పుడు అందరి నోటా అదే మాట. ఎక్కడా అవే ఊసులు. లాక్‌డౌన్‌తో దేశ...
05-04-2020
Apr 05, 2020, 13:30 IST
కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. వైరస్‌ ధాటికి ఆయా దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు అవుతోంది....
05-04-2020
Apr 05, 2020, 13:29 IST
‍ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జనాలు ఇళ్లకు పరిమితమై గోళ్లు గిల్లుకుంటున్నారు. కరోనా వైరస్‌కు మందు లేదు.....
05-04-2020
Apr 05, 2020, 13:23 IST
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) చీఫ్‌ ఏపీ మహేశ్వరి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన ముఖ్య...
05-04-2020
Apr 05, 2020, 13:05 IST
తమ పంటపొలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకొని వారు అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే జిల్లాలో పదిమందికి కరోనా పాజిటివ్ అని...
05-04-2020
Apr 05, 2020, 12:50 IST
గువాహటి: ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి భార‌త్‌లోనూ విస్త‌రిస్తోంది. అస్సాంలో 25 క‌రోనా కేసులు న‌మోదవ‌గా అందులో 24..  ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో త‌గ్లిబీ...
05-04-2020
Apr 05, 2020, 12:44 IST
సాక్షి, మెదక్‌: జిల్లాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top