ఆగిన మెట్రో రైలు పనులు | metro rail woks stalled in uppal mettuguda route | Sakshi
Sakshi News home page

ఆగిన మెట్రో రైలు పనులు

Jun 30 2014 1:36 PM | Updated on Oct 16 2018 5:04 PM

ఆగిన మెట్రో రైలు పనులు - Sakshi

ఆగిన మెట్రో రైలు పనులు

రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్న మెట్రో రైలుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్న మెట్రో రైలుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సుల్తాన్ బజార్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో భూగర్భ మెట్రోరైలు నిర్మాణం చేపట్టాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన షరతు ఇప్పటికే కొంత అయోమయం సృష్టించగా, ఇప్పుడు ఎల్అండ్టీ మెట్రో రైల్ సంస్థకు, కాంట్రాక్టర్లకు మధ్య మరో వివాదం మొదలై.. అది కాస్తా ముదిరింది.

తమకు డబ్బులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు ఎల్అండ్ టీ మెట్రో రైలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే కారణంతో ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఉప్పల్-మెట్టుగూడ మార్గంలోని పనులను నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement