breaking news
works stalled
-
ఆగిన మెట్రో రైలు పనులు
రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్న మెట్రో రైలుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సుల్తాన్ బజార్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో భూగర్భ మెట్రోరైలు నిర్మాణం చేపట్టాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన షరతు ఇప్పటికే కొంత అయోమయం సృష్టించగా, ఇప్పుడు ఎల్అండ్టీ మెట్రో రైల్ సంస్థకు, కాంట్రాక్టర్లకు మధ్య మరో వివాదం మొదలై.. అది కాస్తా ముదిరింది. తమకు డబ్బులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు ఎల్అండ్ టీ మెట్రో రైలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే కారణంతో ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఉప్పల్-మెట్టుగూడ మార్గంలోని పనులను నిలిపివేశారు. -
‘కిరణ్’ సర్కార్ మంజూర్లపై బాబు వేటు
గత సర్కారు అనుమతించిన రూ.300 కోట్ల పనుల నిలిపివేత ఏపీ సీఎం కార్యాలయం ఆదేశం సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తొలి వేటు వేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఫిబ్రవరి నెలలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 13 జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి మంజూరు చేసిన పనులను, నిధులు విడుదలను నిలుపుదల చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కిరణ్ సర్కార్ మంజూరు చేసిన రూ. 300 కోట్ల నిధులు విడుదల, పనులు నిలిచిపోనున్నాయి. ఇందులో పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి కిరణ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేసిన రూ. 80 కోట్ల విలువైన పనులు ఉన్నాయి. ఇప్పటివరకు పనులు ఎక్కడ వరకు జరిగితే అక్కడే నిలిపేయాలని, తదుపరి పనులు చేయపట్టవద్దని, అలాగే నిధులను విడుదల చేయవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రణాళికా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.