విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల | merger possible only with congress party, says ponnala laxmaiah | Sakshi
Sakshi News home page

విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల

Sep 17 2014 10:43 AM | Updated on Mar 18 2019 7:55 PM

విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల - Sakshi

విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన ఘనత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన ఘనత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గాంధీభవన్లో బుధవారం జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయజెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, వాళ్ల కుటుంబాలను ఆదుకుంటామన్న హామీని తెలంగాణ సర్కారు నిలబెట్టుకోవాలని పొన్నాల చెప్పారు.

సెప్టెంబర్ 17 విలీనదినాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో చెప్పిన కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ సాధించిన విజయాలు శాశ్వతం కావని, పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణ గతంలో పాలకులను తరిమికొట్టిన వాస్తవాన్ని టీఆర్ఎస్ మరిచిపోరాదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement