వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.
మేయర్‌ను ఆప్యాయంగా పలకరించిన సీఎం
వరంగల్ అర్బన్ : వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వరంగల్ గ్రేటర్ మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన నరేందర్ పుష్పగుచ్ఛం అందజేసి తనకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపా రు. మేయర్ నరేందర్ రెండు చేతులతో నమస్కా రం పెట్టుకుంటూ సీఎం వద్దకు వెళ్లగా.. ఆయన నరేంద్రుడా రా.... అంటూ అప్యాయంగా పలకరి స్తూ ఆలింగనం చేసుకుని అభినందించారు.
ఆ క్షణాలు మరువలేను : నరేందర్
సీఎం కేసీఆర్‌ను కలిసిన క్షణాలు మరువలేనివని గ్రేటర్ మేయర్ నన్నపనేని నరేందర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. తనను సీఎం ఆలింగనం చేసుకుని అభినందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వచనాలు, అభినందనలు ఎల్లవేళలా గుర్తుంటాయని తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్‌ను డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ వెంట ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, మేయర్ సతీమణి వాణి, కుమారుడు ఉన్నారు. అనంతరం జిల్లా మంత్రి చందూలాల్‌ను కూడా మేయర్ నన్నపునేని నరేం దర్ ఎమ్మెల్యేలతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.