మావోల డంప్ లభ్యం | mavo's Dumps is Available for adilabad district | Sakshi
Sakshi News home page

మావోల డంప్ లభ్యం

May 25 2014 1:04 AM | Updated on Oct 9 2018 2:47 PM

మావోల డంప్ లభ్యం - Sakshi

మావోల డంప్ లభ్యం

ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ పోలీసులకు లభ్యమైంది. ఎస్పీ గజరావుభూపాల్ కథనం ప్రకారం

బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ పోలీసులకు లభ్యమైంది. ఎస్పీ గజరావుభూపాల్ కథనం ప్రకారం.. వెంకటాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల డంప్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. చెరువు పైభాగం వెదురు పొదల పక్కన పోలీసులకు నల్ల కవర్ కనిపించడంతో గుంత తవ్వి  బయటకు తీయ గా అందులో ఆయుధాలు, పేలుడు పదార్థాలు కని పించాయి.

ఆరు గ్రేనెడ్లు, నాలుగు టిఫిన్ బాంబులు, నాలుగు ఎస్‌బీఎంఎల్ తుపాకులు, ఆరు ఎస్‌బీబీఎల్ బ్యారెల్స్, పాయింట్ 38 రివాల్వర్, ఏడు లైవ్‌రౌండ్స్, నాలుగు పాయింట్ త్రినాట్‌త్రీ రైఫిల్స్‌మెగజిన్స్, మూడు మెగజిన్‌బాక్స్‌లు, 23 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, నాలుగు స్ప్రింగ్స్, ఐదు పిన్‌బోల్ట్స్, తొమ్మిది టీటైప్‌పిన్‌బోల్ట్స్‌ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వీటిని మంగి దళానికి చెందిన మావోయిస్టులు ఈ డంప్ దాచిపెట్టినట్లు ఎస్పీ తెలిపారు. మారణాయుధాలు, పేలుడు పదార్థాలు తుప్పుపట్టినట్లు పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement