
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను విధించడంతో చాలా మంది ఆహారం అందక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అది వరకు పనులు చేసుకొని స్వశక్తితో బతికిన వారు ఇప్పుడు సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులో కనీసం ఒకపూట కూడా తిండిలేక కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి అండగా నిలబడుతున్నాయి. (ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్)
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం ప్రజలకు , నిస్వార్థంగా సేవ చేస్తున్న పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులకు ఉచితంగా మాస్కులు ఇచ్చేందుకు తయారుచేస్తున్నారు. మాతృభూమి ఫౌండర్ మంజుల, అధ్యక్షుడు రమాకాంత్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు లు సాయి శ్రీ , వివేకవర్ధన్, అంబికా, సంధ్యారాణి సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 500 పైగా మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో అధిక సంఖ్యలో మాస్కులు తయారుచేసి కరోనా నివారణకు తమ వంతు సహాయం చేస్తామని రమాకాంత్ తెలిపారు.