‘చిన్నచేతులు’ పెద్దసాయం చేస్తున్నాయి

Abhayam Foundation and Little Hands Trust India Helping Poor During Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. అనేక స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టులు అన్నదానం, నిత్యవసరసరుకులు అందిస్తూ సాయాన్ని చేస్తున్నాయి.

ఈ సేవ కార్యక్రమంలో భాగంగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న 30 వృధాశ్రమాలు మరియు అనాదాశ్రమాల్లో 21 రోజులు సరిపడా నిత్యావసరాలు పంపిణీని 'లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్',  'అభయం ఫౌండేషన్' సభ్యులు అందించారు. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న  పోలీసులుకు, ప్రభుత్వ అధికారులుకు, సానిటరీ కార్మికులకు, నిత్యవసర సామాగ్రి అందించే వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు మాస్క్‌లు అందించారు. దాదాపు  5500 మాస్క్‌లను పశ్చిమగోదావరి, కృష్ణా, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో అందించారు. వీటితో పాటు హైదరాబాద్ లో 150 రోజు కూలి కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించి మానవత‍్వాన్ని చాటుకున్నారు. అభయం పౌండేషన్‌ ద్వారా మీరు కూడా సాయం అందించాలనుకుంటే 6303251670 నంబర్‌కి కాల్‌ చేయండి

https://www.facebook.com/groups/Abhayam.Group/?ref=bookmarks

https://m.facebook.com/story.php?story_fbid=1279274842278130&id=411726419032981

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top