ఘనంగా వసంత పంచమి | mass aksharabhyasam programme conducted | Sakshi
Sakshi News home page

ఘనంగా వసంత పంచమి

Jan 23 2018 6:42 PM | Updated on Jan 23 2018 6:42 PM

mass aksharabhyasam programme conducted - Sakshi

బెల్లంపల్లి : వసంత పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తల్లిదండ్రులు చిన్నారులను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు చిన్నారుల చిట్టి చేతులతో అక్షరాలు దిద్దించారు. భారీగా తరలివచ్చిన చిన్నారులతో శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ సందడిగా మారింది. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన తల్లి దండ్రులకు తీర్థ ప్రసాదాలను అందించారు.  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


శరణాలయంలో అక్షరాభ్యాసం...


తాండూర్‌ : వసంత పంచమి సందర్భంగా మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వాసవి వనితా క్లబ్‌ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనితా క్లబ్‌ సభ్యులు చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి మాచుకారి సంతోష్, వనితా క్లబ్‌ మండల అధ్యక్షురాలు రాచర్ల వాణి, ప్రధాన కార్యదర్శి బోనగిరి కవిత, కోశాధికారి పుల్లూరి రమ్య, శరణాలయం వ్యవస్థాపకులు గజ్జెల్లి శ్రీదేవి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement