ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్‌చల్‌  | Married Women Hulchal in Front of Khammam Medical Office | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్‌చల్‌ 

Jul 24 2019 7:21 AM | Updated on Jul 24 2019 7:21 AM

Married Women Hulchal in Front of Khammam Medical Office - Sakshi

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బి.భాస్కర్‌ నాయక్‌తో వాగ్వాదానికి దిగిన బాధిత మహిళ

కొత్తగూడెంరూరల్‌: కొత్తగూడెం డివిజన్‌లో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న బి.భాస్కర్‌నాయక్‌ తనను వివాహం చేసుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ బుకాయిస్తున్నాడని ఓ మహిళ మంగళవారం  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఉరి వేసుకుంటానంటూ..హల్‌చల్‌ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే  భర్త చనిపోయాక హైదరాబాద్‌లోని ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తోంది. కొంతకాలం తర్వాత అక్కడే విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌నాయక్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ మహిళను భాస్కర్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన భాస్కర్‌ ఆమెను పట్టించుకోకపోవడంతో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో సీఐ కుమారస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మహిళను, భాస్కర్‌ నాయక్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. తనను వివాహం చేసుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని, తాను గతంలో హైదరాబాద్‌ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానని తెలిపింది. కాగా భాస్కర్‌ మాత్రం తనకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు ఉద్యోగం కావాలంటే పెట్టించానని తెలిపారు. దీంతో తిరిగి హైదరాబాద్‌లోనే కేసు పెట్టాలని సీఐ కుమారస్వామి ఆమెకు సూచించి పంపించారు. కాగా డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద అదే శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement