
మంగళసూత్రాన్ని చూపుతున్న పురోహితుడు
తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మ ండలంలోని హైదర్‌సాయిపేట తూర్పుతండా లో ఆదివారం తెల్లవారుజామున రావిచెట్టు, వేపచెట్టుకు పెళ్లి చేశారు. తూర్పుతండాకు చెం దిన బానోతు గోపి ఇంట్లో రావిచెట్టు, వేప చె ట్టు పక్కపక్కనే పెరిగి వృక్షాలుగా మారాయి. ఆ రెండు ఒకే చోట ఉంటే వాటికి పెళ్లి జరిపిస్తే కుటుంబానికి శుభం కలుగుతుందని పురోహితులు చెప్పారు.
దీంతో తెల్లవారుజామున బా నోతు గోపి, సక్కుబాయి దంపతులు, మేళతాలలు, పురోహితుడి వేదమంత్రోచ్ఛరణల మద్య వివాహం జరిపించారు. మనుషులకు క్ర తువు ఎలా నిర్వహిస్తారో అలాగే ఈ వివాహం జరిపించారు.