చెట్టు కిందే ఒక్కటైన జంట | Marriage at near the tree | Sakshi
Sakshi News home page

చెట్టు కిందే ఒక్కటైన జంట

May 11 2017 2:18 AM | Updated on Oct 20 2018 7:44 PM

చెట్టు కిందే ఒక్కటైన జంట - Sakshi

చెట్టు కిందే ఒక్కటైన జంట

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో నివాస స్థలం విషయంలో నెలకొన్న వివాదంతో పోలీసు ఆంక్షల మధ్య చెట్టు కింద వివాహం జరిగింది.

ఎలిగేడు(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో నివాస స్థలం విషయంలో నెలకొన్న వివాదంతో పోలీసు ఆంక్షల మధ్య చెట్టు కింద వివాహం జరిగింది. ‘సాక్షి’లో బుధవారం ‘చెట్టు కింద పెళ్లి’శీర్షికన ప్రచురితమైన కథనానికి తహసీ ల్దార్‌ నాగరాజమ్మ, సర్పంచ్‌ పెద్ది అనిత సమ్మయ్యలు స్పందించారు.

బుధవారం ఉదయం సుల్తానాపూర్‌లోని వధువు ఇంటికి వచ్చి, ఆమె సుష్మిత తండ్రి వడ్లకొండ రామలక్ష్మయ్యతో మాట్లాడారు. రామలక్ష్మయ్యకు చెందిన వివాదాస్పద స్థలంలోనే టెంటు, కళ్యాణ మండపం వేయించారు. దీంతో సుష్మిత వివాహం శ్రావణ్‌తో సంప్రదాయబద్ధంగా జరిగింది. అంతా కొత్త దంపతులను ఆశీర్వదించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement