చర్లలో మావోయిస్టు లేఖ కలకలం | maoist letter in cherla | Sakshi
Sakshi News home page

చర్లలో మావోయిస్టు లేఖ కలకలం

Jun 24 2015 8:20 PM | Updated on Oct 9 2018 2:38 PM

ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ ను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ పేరుతో విడుదలైన ఈ లేఖలో డిమాండ్ చేశారు.

ఎన్నికల హామీల్లో భాగంగా పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement