దళిత జాతిని అవమానిస్తున్న సీఎం | Mandakrishna madiga commeted on kcr | Sakshi
Sakshi News home page

దళిత జాతిని అవమానిస్తున్న సీఎం

Jan 8 2017 2:06 AM | Updated on Oct 8 2018 3:00 PM

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని పొడిగించకుండా

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీ కాలాన్ని పొడిగించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవమానపర్చారని, ఇది దళిత జాతికి జరిగిన అవ మానంగా భావిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

శనివారం సూర్యాపేటలో విలేక రులతో మాట్లాడుతూ పదవీ కాలాన్నీ కేంద్రం పొడిగించలేదన్న మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటనపై వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఇది దద్దమ్మ ప్రకటనగా అభివర్ణించారు. సబ్‌ప్లాన్  నిధుల మళ్లింపు అంశంపై ప్రతిపక్షాలు నిలదీస్తాయని సీఎం అసెంబ్లీకి హాజరు కాలేదని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement