మాంసం పంచుకోవడంలో వివాదం: వ్యక్తి హత్య | Man murdered | Sakshi
Sakshi News home page

మాంసం పంచుకోవడంలో వివాదం: వ్యక్తి హత్య

Nov 26 2015 2:45 PM | Updated on Jul 30 2018 8:29 PM

వేటకు వెళ్లి కొట్టుకొచ్చిన వన్యప్రాణుల మాంసం పంచుకోవడంలో చెలరేగిన వివాదం ముదిరి పాకానపడి ఒకరి హత్యకు దారి తీసింది.

మహదేవ్‌పూర్ (కరీంనగర్) : వేటకు వెళ్లి కొట్టుకొచ్చిన వన్యప్రాణుల మాంసం పంచుకోవడంలో చెలరేగిన వివాదం ముదిరి పాకానపడి ఒకరి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం దమ్మూరు గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పెద్దిగడ్డ బాబు(40), చిన్నబాపు(35) వేటకు వెళ్లి వన్య ప్రాణుల మాంసాన్ని తెచ్చుకున్నారు. దాన్ని పంచుకునే క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో చిన్నబాపు కర్రతో బాబుపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగ గాయపడిన బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement