తెల్లవారేసరికి చెరువుకట్ట వద్ద శవమై... | man killed in nizamabad distirct | Sakshi
Sakshi News home page

తెల్లవారేసరికి చెరువుకట్ట వద్ద శవమై...

Apr 23 2016 12:53 PM | Updated on Aug 29 2018 8:36 PM

నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడ పట్టణం సమీపంలోని ఎల్లయ్యచెరువు కట్ట వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.

బాన్స్‌వాడ: నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడ పట్టణం సమీపంలోని ఎల్లయ్యచెరువు కట్ట వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పట్టణానికి చెందిన భాస్కర్ (33)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన భాస్కర్ ఉదయమైనా తిరిగి రాలేదు. కంగారుతో కుటుంబ సభ్యులు గాలించగా ఎల్లయ్య చెరువుకట్ట వద్ద శవమై కనపించాడు. మృతదేహం బాగా కాలిపోయిన స్థితిలో ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement